పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా హిందువు కావడంతో అప్పటి జట్టులోని కొంతమంది ఆటగాళ్లు డానిష్‌పై వివక్ష చూపారని, డానిష్ తో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.దీనిపై బీజేపీ ఎంపీ డి.అర్వింద్ స్పందిస్తూ ఏఐఎంఐఎం అధినేత ఒవైసీతో పాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.పాక్ తరఫున ఆడే ఒక క్రికెట్ ప్లేయర్ దుస్థితి ఇలా ఉంటే.. సాధారణ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది ఆ దేశంలో? అని అర్వింద్ ప్రశ్నించారు. మరి అలాంటి వారికి పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని సర్వ శక్తులు ఒడ్డి వ్యతిరేకిస్తున్న ఒవైసీ–తెరాస ధ్వయానికి ఇవన్నీ కనిపించడం లేదా? అంటూ ట్వీట్ చేశారు.అక్తర్ చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ,సినీ ప్రముఖులకు బీజేపీ నేతలు,చట్టాన్ని సమర్థిస్తున్న ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలతో నోటమాట రావడం లేదు..