పాక్‌ జట్టులో మత వివక్ష ఉండేది..

  • In Sports
  • December 27, 2019
  • 226 Views
పాక్‌ జట్టులో మత వివక్ష ఉండేది..

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌,రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో జట్టులో కొంతమంది ఆటగాళ్లు మత,ప్రాంతీయ వివక్ష చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ ఆటగాడైన దానిష్కనేరియాపై వివక్ష చూపెట్టేవారన్నాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు.జట్టు కోసం మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాడు హిందువు అయితే తప్పేంటి? కనేరియా మద్దతు లేకుంటే ఇంగ్లాండ్‌పై మేం టెస్టులు గెలిచేవాళ్లం కాదు. కానీ, ఆ ఘనత అతనికి దక్కకుండా చేశారు” అని షోయబ్ అక్తర్‌ పేర్కొన్నాడు. అక్తర్‌ వ్యాఖ్యలను కనేరియా సమర్థించడం విశేషం.నా కెరీర్‌లో ప్రాంతీయతపై మాట్లాడటం ప్రారంభించినప్పుడు జట్టులోని ఇద్దరు ముగ్గురి ఆటగాళ్లతో నేను విభేదించేవాణ్ని. కరాచి నుంచి ఎవరు ఉన్నారు.. పంజాబ్‌ లేదా పెషావర్‌ నుంచి ఎవరైనా ఉన్నారా? లాంటి మాటలు తీవ్రమైన కోపం తెప్పించేవి” అని అన్నాడు. షోయబ్ ఓ లెజెండ్. అతని మాటలు కూడా అతని బౌలింగ్ లాగా మొద్దుబారినవి. నేను ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అక్తర్‌ చెబుతున్న మాటలు నిజం. అతనితో పాటు ఇంజమాముల్‌ హక్‌, మహమ్మద్‌ యూసుఫ్‌, యూనిస్‌ ఖాన్‌ నాకు మద్దతుగా నిలిచేవాళ్లు” అని కనేరియా తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos