చిరు ఇంట సందడి

  • In Film
  • December 26, 2019
  • 137 Views
చిరు ఇంట సందడి

మెగాస్టార్‌ చిరంజీవి రెండో కూతురు శ్రీజా- కళ్యాణ్‌ దేవ్‌ల గారాల పట్టి నవిష్క పుట్టిన రోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ పార్టీలో రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఎల్లో కలర్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. పార్టీలో శ్రీజ, కల్యాణ్ దంపతుల కూతురితో దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘అందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు. అత్త మామల ప్రేమతో..హ్యపీ బర్త్‌డే డార్లింగ్‌ నవిష్క’ అని క్యాప్షన్‌ జోడించారు. అలాగే బర్త్‌డే బేబీ తండ్రి కళ్యాణ్‌ దేవ్‌ సైతం కూతురు పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగ ట్వీట్‌ చేశారు. తన కూతురు మీద ఉన్న ప్రేమను ముద్దుగా ట్వీట్‌ రూపంలో తెలియజేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos