యూపీలో ఆరని మంటలు

యూపీలో ఆరని మంటలు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఇంకా హొరెత్తుతూనే ఉన్నాయి. అధికారులు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. బులంద్‌షహర్‌లో గురువారం సాయంత్రం నుంచి శనివారం వరకు, ఆగ్రాలో శుక్రవారం వరకు ఇంటర్నెట్‌ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వదంతులు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించామని బులంద్‌షహర్, ఆగ్రా జిల్లా అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos