రోజూ ఎర్రని టొమాటోలు తింటే చర్మ కేన్సర్ రాదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎర్రని టొమాటోలు తినడం వల్ల అతి నీల లోహిత కిరణాల దుష్ప్రభావం మన చర్మంపై పడదు. టొమాటోలకు ఎర్రని రంగునిచ్చే డయటరీ కాంపౌండ్స్ అయిన కెరటె నాయిడ్స్, పిగ్మెంటింగ్ కాంపౌండ్స్ ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అవే అతినీల లోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి మనల్ని కాపాడుతున్నాయని తేల్చారు.