యోగి ప్రతీకారం

యోగి ప్రతీకారం

లక్నో: నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా జరిగిన ఆందోళనలో ధ్వంసం చేసిన ప్రజా ఆస్తులకు పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది మందికి బుధవారం తాఖీదుల్ని జారీ చేసింది. మొత్తం రూ.14.86 లక్షలు చెల్లించాలని సూచిం చింది. దెబ్బతిన్న పోలీసు శిరస్త్రాణాలు, లాఠీలకూ పరిహారాన్నిచెల్లించాలని ఆదేశించింది. హింసకు పాల్పడ్డారనే ఆరోపణపై 31 మందిని అరెస్టు చేశారు. ‘ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తాం. తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామ’ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇది వరకే ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos