చెన్నై:నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సోమవారం ఇక్కడ ర్యాలీ నిర్వహించిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సహా 8,000 మందిపై పోలీసులు మంగళ వారం కేసు దాఖలు చేసారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిని నేరానికి కేసు న మో దు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం జరిగిన ఆందోళనలో స్టాలిన్ వెంట కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, డీఎండీకేలకు చెందిన పలువురు సీనియర్ నేతలు విపక్ష పార్టీల నేతలు, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. విపక్ష నేతల్లో పి.చిదంబరం, దయా నిధి మారన్, కె.కని మొళి, వైకో, పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. పెద్ద సం ఖ్యలో రైతులు, వ్యాపారులూ పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఐదు వేల మందికి పైగా పోలీసులు మోహరిం చారు.