ముంబై: రాజకీయాల గురించి నోరు మెదిపేందుకు నటులు భయపడు తున్నారని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా మంగళ వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు వాటిపై స్పందిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అందుకే చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం పేర్కొన్నారు. ‘బాలీవుడ్లో కొందరు మాత్రమే రాజకీ యాల గురించి మాట్లాడతారు. వాస్తవానికి వారు మాత్రమే అన్ని విషయాల గురించి స్పందిస్తారు. చాలా మంది రాజకీయాల గురించి మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే, ఏ విషయం గురించైనా మాట్లాడాల్సి వస్తే దానికి మూల్యం చెల్లించు కోవా ల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. అందుకే చాలా మంది నోరు విప్పడం లేదు. ఏమైతేనేం, ఆ కొందరైనా ఉన్నందుకు సం తో షం. అంతే కాకుండా ఇలాంటి భయాల్ని ఎదుర్కొనే ధైర్యం క్రమ క్రమంగా పెరుగుతోంద’న్నారు.