ఎంత పెద్ద పెదవులో..

ఎంత పెద్ద పెదవులో..

నలుగురిలో అందంగా కనిపించాలనే ఆశ,తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది.యువతకైతే ఈ ఆశ,తాపత్రయం పాళ్లు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి.దీంతో అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలనే తాపత్రయంతో కోరిమరీ కష్టాలు,వికృతరూపాలు కొని తెచ్చుకుంటారు.తాజాగా బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇనోవా(22) అమ్మాయి కూడా అందంపై పిచ్చితో వికృత రూపాన్ని కొని తెచ్చుకుంది.ఇనోవా తన పెదవులను పెద్దగా చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.అందులో భాగంగా పెదవులకు 17 సార్లు హైయాలురోనిక్‌ యాసిడ్‌ ఇంజెక్షన్లు చేయించుకుంది.దీంతో ఇనోవా పెదవులు ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులుగా గుర్తింపు పొందాయి.అయితే ఇనోవా అంతటితో ఆగలేదు.పెదవులను మరింత పెద్దగా చేసుకోవడానికి 134 పౌండ్ల ఖర్చుతో ప్రతినెలా ఇంజెక్షన్లు చేసుకోవడంతో పెదవులు మరింత పెద్దగా తయారయ్యాయి.దీంతో ఇనోవా పెదవులు వికృతంగా మారాయి.సమాజంలోని ప్రజలతో పాటు నెటిజన్లు సైతం ఇనోవా పెదవులపై రకరకాల కమెంట్లు చేస్తున్నారు.అయితే ఇనోవా మాత్రం పెద్ద పెదవులతో సంతోషంగా ఉన్నానని తన పెదవుల్లో ఎన్నో రకాల లిప్‌ ఫిల్లర్లు ఉన్నాయని చెబుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos