పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి.ఉత్తరప్రదేశ్,ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకం కావడంతో పది మందికి పైగా మృతి చెందారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో మొదలైన సవరణ చట్టం నిరసనలు మెల్లిగా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సైతం పాకాయి.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకం కావడంతో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఈ అల్లర్ల వెనుక మతఛాందస,సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది.ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా కొన్ని ఫోటోలు,వీడియోలు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది.నిరసన పేరుతో కొందరు మతాంధవాద మూకలు.. ముఖాలు రుమాళ్లు కట్టుకుని.. రాళ్లు రువ్వారు. మరికొందరు అతి తెలివితో.. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని ధ్వంసం చేశారు. నిరసనల్లో విధ్వంసం సృష్టించడానికి కొందరు ముందస్తు ప్లాన్ వేసినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు.

ముఖానికి రుమాలు కట్టుకున్న నిందితుడు..
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. పోలీసులు ఇక్కడికి వచ్చినపుడు… రహదారికి అడ్డంగా ఇనుపకడ్డీలు, రాళ్లు విసిరే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆందోళనకారులు ప్రి-ప్లాన్డ్‌గా చేసిన హింసకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలోని అనేక సున్నితమైన ప్రాంతాల్లో కొందరు ఆందోళనకారులు వాహనాలు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు ఎవరు నిప్పంటించారు అనే విషయంపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇదే సమయంలో గూడ్స్ ఆటోలో రాళ్లు, పెట్రోల్ తీసుకు వచ్చిన కొందరు ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు నాశం చేశారని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయిన విషయంపోలీసులు గుర్తించారు. మంగళూరులో ఓ వర్గానికి చెందిన మతాంధులు పక్కాప్లాన్‌తో క్రిమినల్ మైండ్ ఉపయోగించి అల్లర్లు జరగడానికి కారణం అయ్యారని పోలీసులు పక్కా సాక్షాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా… హింసకు పాల్పడ్డ ఆందోళనకారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.ఇంత జరిగినా అక్కడి కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల నేతలు ఆ వర్గం తరపున మాట్లాడుతుండడం గమనార్హం..

ముఖానికి రుమాలు కట్టుకున్న నిందితుడు..