బుర్ఖా ధరించినందనే కారణంగా భద్రతా సిబ్బంది ఆడిటోరియం లోపలికి వెళ్లడానికి నిరాకరించడంతో ఓ విద్యార్థిని బంగారు పతకం తీసుకోవడానికి నిరాకరించింది.కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని పాండిచ్చేరి యూనివర్శిటీలో పదవీ ప్రమాణ పత్రాల ప్రదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విద్యార్థులకు పదవీ ప్రమాణ పత్రాలు,ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు.ఈ క్రమంలో అదే వర్శిటీకి చెందిన విద్యార్థిని రబీహా అబ్దురెహీమ్కు బంగారు పతకం వచ్చింది.దీంతో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రబీహాను భద్రతా సిబ్బంది ప్రవేశ మార్గం వద్దే అడ్డుకున్నారు. రబీహా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని కావడంతో హిజబ్ ధరించింది. బుర్ఖాను తీసివేయాల్సిందిగా భద్రతా సిబ్బంది విద్యార్థినిని కోరింది. బుర్ఖాను తొలగించేందుకు రబీహా ససేమిరా అని చెప్పడంతో లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఇతర విద్యార్థులతో పాటుగా ఆడిటోరియంలో కూర్చొని ఉండగా బుర్ఖా ధరించి ఉందన్న కారణంతో భద్రతా సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా చెప్పిందని రబీహా వెల్లడించింది. ఇక ఓ వైపు కార్యక్రమం జరుగుతుండుగా మరోవైపు బుర్ఖాను తొలగించాల్సిందిగా భద్రతా సిబ్బంది తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపింది.కార్యక్రమం ముగియడంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెళ్లిపోయాక యూనివర్శిటీ స్టాఫ్ మిగిలిన విద్యార్థులకు సర్టిఫికేట్లను ఇచ్చింది. సిబ్బంది గోల్డ్మెడల్, మరియు సర్టిఫికేట్లు ఇచ్చిన సమయంలో రబీహా వాటిని తిరస్కరించింది. తనను బహిరంగంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గోల్డ్ మెడల్ తిరిగిచ్చేసిన రబీహా కేవలం సర్టిఫికేట్ను మాత్రమే తీసుకుంది. సర్టిఫికేట్ను మాత్రమే తీసుకున్న రహీబా దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా తాను నిలబడతానని చెప్పుకొచ్చింది..