మూడు రాజధానులు.. మంచిదే

మూడు రాజధానులు.. మంచిదే

న్యూఢిల్లీ: జగన్మోహన రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల పరికల్పనను భాజపా అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సమర్థించారు. ‘రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశం. అభివృద్ధి వికేంద్రీ కరణ నిర్ణ  యాన్నిసమర్థిస్తున్నా. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిపుణుల సమితి నివేదిక తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాల’న్నారు. ‘ శివరామకృష్ణ సమితి కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. గత ప్రభుత్వం నివేదికలు, గ్రాఫిక్స్కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ సమితిని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకో లేదు. దీంతో రాయలసీమ చాలా నష్టపోయింది. నిజానికి ఒకేచోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, ఉన్నత న్యాయస్థానం మరోచోట ఉన్నాయి. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos