అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు బుధవారం వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. రాయపూడి, వెలగపూడి, మందడం , తుళ్లూరు గ్రామాల రైతులంతా రోడ్డు పై భైఠా యిం చి నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రతిపాదనను ఉపసంహరించుకోక పోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చ రిం చా రు. రాజధానిగా అమరావతినే కొనసాగించి పరిపాలన మొత్తం ఇక్కడ నుంచే చేయాలని డిమాండు చేసారు.