విశాఖ పట్టణం: పాలనా రాజధానిగా విశాఖ పట్నాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేసిన ప్రతిపాదనను తెదేపా నేత గంటా శ్రీనివాసరావు బుధవారం ట్విట్టర్లో స్వాగతించారు. సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణ య మని ప్రశంసించారు. ‘ రహదారి. రైలు, విమానాలు, సాగర రవాణా వ్యవస్థల్ని కలిగిన రాజధానిగా అందరి ఆశలు, ఆంక్ష లని నెరవేర్చే నగరంగా మారుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు సహకరించటానికి సిద్ధంగా ఉన్నార’ని తెలిపారు.