తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. సిద్ధిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోన్న ఈ సోదాల్లో ఇప్పటివరకు నర్సింహారెడ్డికి సంబంధించిన రూ.5 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.హైదరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి లోని నర్సింహారెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.మరోవైపు నర్సింహారెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నర్సింహారెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్, హైదరాబాద్ లోని విల్లా, ఇంటి స్థలాలను అధికారులు గుర్తించారు. సిద్ధిపేట వన్టౌన్ కానిస్టేబుల్ సాంబిరెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.కాగా ఇప్పటి వరకు సిద్ధిపేటలో భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.ఇప్పటివరకు రూ.30కోట్ల అక్రమ ఆస్తులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.