నాగపూర్:నగర మేయర్, భాజపా నేత సందీప్ జోషిపై హత్యా యత్నం జరిగింది. మంగళ వారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న వాహ నంపై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో మూడు సార్లు కాల్పులు జరిపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు అద్దాలు ధ్వంస మయ్యాయి. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. కా ల్పు లకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని భాజపా కార్యకర్తలు నేతలు డిమాండ్ చేశారు. సందీప్ ను హతం చేస్తా మని ఈ నెల 6న ఒక లేఖ నగర పాలక ఫిర్యాదుల పెట్టెలో కనిపించింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ముంబైకి చెందినవారు ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.