దక్షిణాఫ్రికా దేశంలో మరో సరికొత్త రాజకీయ పార్టీ అవతరించింది.క్రిస్టియానిటీ దేశమైన దక్షిణాఫ్రికాలో ద హిందూ యూనిటీ మూవ్మెంట్ పేరుతో దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం వద్ద ఒక రాజకీయ పార్టీ నమోదైంది. దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ అధ్యక్షుడు రామ్ మహారాజ్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.హిందువుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు ఆ పార్టీ జాతీయ నేత జయరాజ్ బచ్చు తెలిపారు. హిందువులను స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ భాషలను పాఠ్యాంశాలుగా మళ్లీ చేర్చడంతోపాటు దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించడమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్న జయరాజ్.. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హెచ్యూఎం పోటీ చేస్తుందని తెలిపారు.