మూడో ప్రియురాలిని పరిచయం చేసిన రౌడీ..

  • In Film
  • December 15, 2019
  • 140 Views
మూడో ప్రియురాలిని పరిచయం చేసిన రౌడీ..

టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్రబృందం మరో కొత్త పోస్టర్‌ విడుదల చేశారు.నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడే కథాంశంతో తెరకెక్కుతున్నవరల్డ్ ఫేమస్ లవర్చిత్రంలో విజయ్‌కి రాశీఖన్నా,ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా లెట్చిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఇజబెల్లా, ఐశ్వర్యా రాజేశ్ పాత్రలను పరిచయం చేసిన చిత్ర బృందం తాజాగా విజయ్ దేవరకొండ,కేథరిన్ పోస్టర్ ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం ప్రేమికుల రోజున సినిమా విడుదల కానుంది. తన పాత్రను తాను పరిచయం చేసుకున్న కేథరిన్, “బొగ్గు గనిలో నా బంగారం. వరల్డ్ ఫేమస్ లవర్. లవర్స్ డే రోజున నేను ప్రేమించే యూనియన్ లీడర్ శ్రీనును కలవండిఅని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సైతం తన తాజా పోస్టర్ ను విడుదల చేస్తూ, “యూనియన్ లీడర్ శ్రీను, స్మితా మేడమ్అని కామెంట్ పెడుతూ అదే ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos