గువాహతి: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆగ్ర హావేశాలు ప్రదర్శి స్తున్నందున సామాజిక మాధ్యమ విని యోగదారులు అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. ‘అవాస్తవాలతో రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తారు. తప్పుడు వార్తలను నమ్మొద్దు. నిరసనలు, ఇతర కార్యక్రమాలకు గురించి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాల’ని కోరింది. అసోంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించా రు.