అమరావతి: ఎందరు శాసన సభ్యుల పిల్లలు తెలుగు మాధ్యమంలో చదువుతున్నారని వైకాపా శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. గురువారం శాసనసభలో ఆయన ఆంగ్లంలో విద్యా బోధన గురించి జరిగిన చర్చలో పాల్గొన్నారు. పేద విద్యా ర్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్మికుల పిల్లలకు కూడా అత్యు న్నత విద్య అందాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్షన్నారు. సాంకేతిక విద్యకు బలహీనవర్గాల పిల్లలు చేరువ య్యేందుకు ఆంగ్ల మా ధ్య మం దోహద పడు తుందని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేయడం సరి కాద న్నారు. మన పిల్లలు చదువుతున్న చదువే అందరూ చదవాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సమాజగతిలో మార్పు నకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన దోహదపడుతుందని పేర్కొన్నారు.