ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా?

ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా?

హైదరాబాదు: ‘దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను. ఒక అమ్మాయిగా గర్వ పడుతున్నాను, కానీ ఈ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా’ని నటి మంచు లక్ష్మి ప్రశ్నించారు. ‘ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి. దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమే. వారి బాధ తీరనిది. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్ని మార్చి కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంద’ని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos