హోసూరు: హోసూరు పరిసరాల్లో శుక్రవారం అంబేద్కర్ 63 వ వర్ధంతిని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు . ఆగ్గొండపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జుజూవాడి గ్రామంలో వి సి కె పార్టీ నాయకులు రామచంద్ర కృష్ణ, ఆ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను వారు కొని యాడారు .