క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడాడు..

క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడాడు..

మూడో అంతస్తు జారిపడ్డ చిన్నారిని ఓ యువకుడు చాకచక్యంగా క్యాచ్‌ పట్టుకొని కాపాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డామన్‌ డయ్యూలో మంగళవారం రాత్రి ఓ భవనంలోని మూడో అంతస్తు నుంచి రెండేళ్ల బాబు జారిపడిపోతుండడాన్ని స్థానికులు గమనించారు.దీంతో బాలుడినిక్యాచ్ పట్టుకోవాలని చూశారు. ఇంతలో బాలుడు కిందపడిపోయాడు.ఈ క్రమంలో కింద ఉన్న యువకుల్లో ఒకరు చిన్నారిని చాకచక్యంగా క్యాచ్ పట్టి ప్రాణాలు రక్షించారు. బాలుడికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని క్యాచ్ పట్టగా తీసిన వీడియో బయటకు వచ్చింది. ఘటన డామన్డయ్యూలో గత రాత్రి సమయంలో చోటు చేసుకుంది. బాలుడి ప్రాణాలు రక్షించిన యువకులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కింద ఉన్న యువకులు.. బాలుడిని గుర్తించకపోతే చిన్నారి ప్రాణాలు కోల్పోయేవాడు. బాలుడు మూడో అంతస్థు నుంచి కింద ఎలా పడిపోయాడన్న విషయంపై స్పష్టత రాలేదు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos