విక్రమ్ జాడ కనుగొన్న చెన్నై ఇంజనీర్‌

విక్రమ్ జాడ కనుగొన్న చెన్నై ఇంజనీర్‌

చెన్నై:జాబిల్లిలో కుప్పకూలిన చంద్రయాన్-2 వ్యోమనౌక  ల్యాండర్ – విక్రమ్ జాడ కనుక్కోవడంలోఇస్రో, నాసా చేయలేని పనిని ఇక్కడి ఒక సాధారణ మెకానికల్ ఇంజినీరు షణ్ముగ సుబ్రహ్మణియన్ సాధించాడు. సుబ్రహ్మణి యన్కుఅంతరిక్ష పరి శోధనల పై ఆసక్తి ఎక్కువ. సాంకేతిక అంశాలపై బ్లాగ్ రాస్తుంటారు. చంద్రయాన్-2తో, నాసాతో అతనికి సంబంధం లేదు. విక్రమ్ జాడను నాసా కూడా కనుక్కోలేకపోవడం అతన్ని నిరాశకు గురి చేసింది. దాని గుర్తింపును సవాల్గా భావించి విక్రమ్  –  ల్యాండ ర్ జాడ కోసం నాసా లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో) కెమెరాతో తీసిని కొన్ని చిత్రాలను సెప్టెంబరు 17న విడుదల చేసింది. అప్పుడు ల్యాండర్ దిగాల్సిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో నాసా ఎలాంటి ఆనవాళ్లను గుర్తించ లేక పోయింది. షణ్ముగ అవే చిత్రాలను ఆధారం చేసుకున్నారు. విక్రమ్ ల్యాండర్ ప్రయోగానికి ముందు జులై 16న తీసిన చిత్రాన్ని, సెప్టెంబరు 17న నాసా విడుదల చేసిన చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. సాఫ్ట్వేర్ సాంకేతిక జ్ఞానంతో నాసా చిత్రాల్ని పిక్సెల్ టు పిక్సెల్ అధ్యయనం చేసాడు. ల్యాండర్ సంబంధాలు కోల్పోయినప్పుడు ఉన్న వేగం, ఎత్తు, అది దిగాల్సిన ప్రాంతం.. దాని పరిసరాల ను అధ్యయనం చేశారు. లక్షిత ప్రదేశానికి 1కి.మీ దూరంలో ఉపరితలంపై మార్పులు ఉన్నట్లు గమనించారు. దాన్ని విక్రమ్ గా భావించారు. తన అధ్యయనాన్ని ఆధారాలతో సహా నాసాకు మెయిల్ ద్వారా పంపారు. దరిమిలా నాసా అక్టోబర్ 14, 15, నవంబర్ 11న ఎల్ఆర్వో ద్వారా మరి కొన్ని చిత్రాలు తీసింది. అప్పుడు వెలుతురు ఉండడంతో షణ్ముగ గుర్తించిన ప్రదేశంతో పాటు మరో 24చోట్ల మార్పులు ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. సుబ్రహ్మణియన్ అధ్యయనంపై నాసా ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్ర వేత్త నోవా పెట్రో స్పందించారు. ‘‘ఈ వ్యక్తి చేసిన అద్భుత అధ్యయనం మాకు ఎంతో ఉపయోగపడింది. అతడికి ఎల్ఆర్వో ప్రాజె క్టు తో గానీ, చంద్ర యాన్-2 మిషన్తో గానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఈ ప్రయోగంపై ఉన్న ఆసక్తితో మా సమా చారాన్ని వినియోగించుకొని ఉపరితలంపై మేం గుర్తించలేకపోయిన తేడాను గమనించగలిగాడు. దీని కోసం అతను ఎంతో శ్రమించి ఉంటా డు’’ అని నోవా పెట్రో తెలిపారు. విక్రమ్ శకలాలను తొలుత కనుగొన్న ఘనతను నాసా షణ్ముగానికే ఇచ్చింది. ఈ మేరకు అతడికి ఇ-మెయిల్ ద్వారా లేఖ కూడా పంపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos