అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైకాపా నేత విజయ సాయి రెడ్డి మంగళవారం ట్విట్టర్లో విమర్శలు గుప్పిం చారు. ‘ఎన్నికల్లో ప్రజలు పొర్లించి కొట్టినంత పని చేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. నటుణ్ని చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లి పోవడం అంత కంటే కాదు’ దుమ్ము దులిపేసారు.