సల్మాన్ సినిమాలో.. విలన్ గా సౌత్ హీరో!

  • In Film
  • January 19, 2019
  • 959 Views
సల్మాన్ సినిమాలో.. విలన్ గా సౌత్ హీరో!

ఒకవైపు సీక్వెల్ సినిమాలు మెజారిటీ భాగం ఫెయిల్యూర్స్ గానే మిగులుతున్నా.. బాలీవుడ్ లో వాటి పరంపర కొనసాగుతూ ఉంది. ఇటీవలే రేస్ సీరిస్ లో ఒక సినిమాతో దెబ్బతిన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో సీక్వెల్ తో వస్తున్నాడు. తన హిట్ ప్రాంచైజ్ దబంగ్ సీరిస్ లో సల్లూ మరో సినిమాను చేయబోతున్నాడు. దబంగ్ త్రీ పేరుతో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో మరోసారి సల్లూ చుల్ బుల్ పాండేగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్ర కోసం పలువురు దక్షిణాది నటులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. ముందుగా జగపతిబాబును కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకున్నారట. అయితే చివరకు ఆ అవకాశం కన్నడ హీరో సుదీప్ కు దక్కినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని అతడు కూడా ధ్రువీకరించాడు. దబంగ్ త్రీలో విలన్ గా నటించే విషయంలో తనను సంప్రదించారని.. అందుకు సంబంధించి చర్చలు సానుకూలంగా ఉన్నాయని సుదీప్ తెలిపాడు. దబంగ్ త్రీలో సుదీప్ విలన్ గా నటించడం దాదాపు ఖరారు అయినట్టుగా స్పష్టత వస్తోంది. కన్నడభాష ఆవలి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేయడం సుదీప్ కు కొత్త ఏమీకాదు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos