ప్రభుత్వానికి ప్రియాంక హత్య నిందితుడి తల్లి విన్నపం..

ప్రభుత్వానికి ప్రియాంక హత్య నిందితుడి తల్లి విన్నపం..

తెలంగాణలో పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మహిళా సంఘాల నుంచి సినీస్టార్లు,జాతీయ నేతలు,మీడియా,విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి ప్రభుత్వానికి చేసిన విన్నపం చర్చనీయాంశమైంది.ప్రియాంకరెడ్డిని ఎలా అయితే అత్యంత దారుణంగా హత్య చేశారో అలాగే తనకొడుకును కూడా చేయాలని నిందితుడు చెన్నకేశవులు తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన కొడుకుని ఉరేసినా పర్వాలేదని ఆమె స్పష్టం చేశారు. తనకు చెన్నకేశవులుతోపాటు ఆడపిల్లలు కూడా ఉన్నారని ఆమె తెలిపారు.ప్రియాంకరెడ్డికి జరిగినట్లు మరే ఇతర ఆడబిడ్డకు జరగకూడదని ఆమె అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తన కొడుకును ప్రియాంకరెడ్డిని చంపినట్లే చంపాలని డిమాడ్ చేశారు. లేదా ఉరేయ్యండి అంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు ఇకపై చోటు చేసుకోకుండా ఉండాలంటే ఉరే సరైన శిక్ష అని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.నాకూ ఆడపిల్లలు ఉన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకోగలను. నా కొడుకు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. జులాయిగా తిరిగే మహ్మద్ ఆరిఫ్ తో కలిసి తిరగడం వల్లే వాడు కూడా పాడై పోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయ్యిందేదో అయ్యిందిలే అని సరి పెట్టుకున్నాం. ఇప్పుడింత పని చేస్తాడనుకోలేదు. ఊరంతా మా గురించే మాట్లాడుకుంటే తలదించుకోవాల్సి వస్తోంది. ఆవమానం భరించలేక నా భర్త ఆత్మహత్యా యత్నం కూడా చేశాడు. అటువంటి కొడుకు ఉంటే ఎంత? పోతే ఎంత? వాడికి ఉరిశిక్ష వేస్తారో? కాల్చి చంపుతారో? వాళ్ల ఇష్టం’ అంటూ జయమ్మ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos