మరోసారి ప్రభాస్ ద్విపాత్రాభినయం..

  • In Film
  • November 30, 2019
  • 168 Views
మరోసారి ప్రభాస్ ద్విపాత్రాభినయం..

సాహో వంటి భారీ చిత్రం అనంతరం ప్రభాస్‌ నటిస్తున్న కొత్త చిత్రం జాన్‌పై అభిమానులు,ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది.సాహో చిత్రం నిరాశపరచినా జాన్‌ చిత్రంతో ప్రభాస్‌ గాడిన పడతాడని అభిమానులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. రొమాంటిక్ జోనర్‌లో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చింది. అందులో ఒక పాత్ర తండ్రిది కాగా, రెండోది కొడుకుదని అంటున్నారు. 1960వ దశకంలో విదేశాల్లో జరిగే ప్రేమకథతో రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ కథ ప్రకారం ప్రభాస్ ధనవంతుల కుమారుడిగా కనిపిస్తాడట. అదే సమయంలో పూజా హెగ్డే పేదింటి అమ్మాయి పాత్ర చేస్తుందట. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుందని సమాచారం. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందనేదే ఆ వార్త సారాంశం. 1960ల నాటి ప్రేమకథ విఫలం అవడం.. ప్రస్తుత జనరేషన్‌లో వాళ్లిద్దరూ మళ్లీ కలవడం వంటి లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos