పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు.కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఐదు మంది ఘటనలో పాల్గొన్నట్లు తెలిపారు.ప్రియాంక హత్య ఘటనలో నిందితులంతా 25 ఏళ్ల లోపు వయసున్నవారేనని తెలిపారు.ఘటనలో ప్రధాన నిందితుడైన నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషాను అరెస్టు చేశారు.అదే మండలం గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి రాయచూర్ కు డీసీఎంలో నిందితులు స్టీల్ రాడ్లను తరలించే పనిలో ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తోన్న ఈ ఐదు మంది ప్రియాంకారెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు.