ఏ విషయంలో అయినా తమను మించిన వాళ్లు లేరని ఫీలయ్యే అరవ జనాలు.. వేరే వాళ్ల గొప్పదనాన్ని ఎప్పుడూ ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తమిళ సినిమాల్లో డ్యాన్సర్లే చాలా తక్కువ. ఉన్నంతలో విజయ్ బాగా డ్యాన్సులేస్తాడు. వాళ్ల ఇండస్ట్రీకి అతనే నంబర్ వన్ డ్యాన్సర్. అంతే కానీ.. మన వాళ్లతో పోల్చుకుంటే అతను పోటీలోనే ఉండడు. ఐతే చర్చ ఎందుకొచ్చిందో ఏమో కానీ.. డ్యాన్స్ విషయంలో విజయ్ ముందు ఎన్టీఆర్ వేస్ట్ అంటూ అరవ జనాలు సోషల్ మీడియాలో అతి చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి డ్యాన్సుల్ని పోలుస్తూ వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు చూస్తేనే ఎన్టీఆర్ ముందు విజయ్ నిలవలేడని స్పష్టమవుతోంది. కానీ అరవ జనాలు ఒప్పుకుంటారా? మా విజయ్ గ్రేట్ అంటూ.. అతడి డ్యాన్స్ వీడియోలు కుమ్మరించడం మొదలుపెట్టారు. ఐతే వాళ్లకు మనోళ్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్స్ వీడియోల్ని బయటికి తీసి.. మీ హీరోను ఒకసారి ఈ స్టెప్పులు ట్రై చేయమనండి అంటూ సవాల్ విసిరారు. మామూలుగా ఎన్టీఆర్ ను వ్యతిరేకించే యాంటీ ఫ్యాన్స్ సైతం ఈ గొడవలోకి వచ్చి.. విజయ్ ఫ్యాన్స్ గాలి తీశారు.తెలుగు-అరవ అభిమానుల మధ్య ట్విట్టర్‌లో ఈ ఫైట్ ముదురుతోంది..