ప్లీజ్… ‘మహానాయకుడు’ని ఉచితంగా ఇవ్వండి.

  • In Film
  • January 19, 2019
  • 959 Views
ప్లీజ్… ‘మహానాయకుడు’ని ఉచితంగా ఇవ్వండి.

కథానాయకుడు.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కనీసం మహానటి లెవల్లో కూడా ఆకట్టుకోలేకపోయిందని తాజా విశ్లేషణలు బట్టి తెలుస్తోంది. సంక్రాంతి పండగకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లా పడినట్లు ట్రేడ్ వర్గాలను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే రూ. 60 కోట్లకు అమ్మేశారు.కానీ ఇప్పటివరకూ కేవలం రూ. 40 కోట్లు మాత్రమే వసూలు అవడంతో డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో విడుదల కాబోయే మహానాయకుడు చిత్రాన్ని తమకు ఉచితంగా ఇవ్వాలనీ, లేదంటే నష్టాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదని గోల చేస్తున్నారట. మరి చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్న బాలయ్య ఏం చేస్తారో.. ఉచితంగా ఇచ్చేస్తారా?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos