న్యూఢిల్లీ: ప్రజ్ఞా వ్యాఖ్యల పై లోక్సభలో గురువారం తీవ్ర దుమారం రేగింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డి మాం డ్ చేశారు. ప్రజ్ఞా వ్యాఖ్యల్ని నిరసించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేసారు. లోక్సభ సభాపతి ఓం బిర్లా కూడా ప్రజ్ఞా వ్యాఖ్య లను ఖండించారు. గాడ్సే దేశభక్తుడని ఆమె అన్న మాటలను దాఖలాల నుంచి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఆ పదం దాఖలాల్లో లేనప్పుడు దానిపై చర్చ అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. ప్రజ్హా వ్యాఖ్యలపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. గాడ్సే దేశభక్తుడని చెప్పే విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ మనందరికీ ఆదర్శప్రాయమని, ఆయనే తమకు మార్గదర్శకుడని చెప్పారు.