చెన్నై: శివ దర్శకత్వంలో రూపొందనున్న రజనీకాంత్ 168వ చిత్రంలో ఆయన సరసన ఖుష్బూ నటించనుందని సమాచారం. కొంతకాలంగా రజనీ సినిమాల్లో యువ కథానాయికలకు బదులుగా సీనియర్ నాయికలు ఉంటున్నారు. కాలాలో ఈశ్వరీ రావు, పేటా లో సిమ్రాన్ ఆయన సరసన కనిపించారు. ఈ సారి ఖుష్బూను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో రజనీ , ఖుష్బూ నటించిన అన్నామలై, మన్నన్, పాండియన్ చిత్రాలు ఘన విజయాల్ని సాధించాయి. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రేక్షకులు ఈ పాత జంటను కొత్తగా గా చూడనున్నారు.