వాషింగ్టన్ : అమెరికాలోని నకిలీ విశ్వ విద్యాలయంలో తొంభై మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. డెట్రాయిట్ మెట్రో పాలిటన్ లోని ఫార్మింగ్టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 250 మంది హోంల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థులను అరెస్టు చేసింది. వీరిలో 90 మంది భారతీయులని తేలింది.గత మార్చిలో నకిలీ యూనివర్శిటీలో చేరిన 161 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ యూనివర్శిటీ అని విద్యార్థులకు తెలిసినా, తరగతులు జరగకున్నా వారు చేరారని పోలీసులు తెలిపారు. అమెరి కాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో విశ్వ విద్యాలయంలో చేరిన విద్యార్థుల్ని అరెస్టు చేయటం క్రూరమైన చర్యగా డెమోక్ర టిక్ అధ్యక్ష అభ్యర్థి సెనేటర్ ఎలి జబెత్ వారెన్ అభివ ర్ణించారు. నకిలీ విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులు అమెరికా రాయ బార కార్యాలయం జారీ చేసిన వీసాతో చట్టబద్ధంగానే అమెరికాకు వచ్చా రు. అమెరికాలో అరెస్టయిన భారతీయ విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.