ప్రజ్ఞా ఠాకూర్‌ పై భాజపా వేటు

ప్రజ్ఞా ఠాకూర్‌ పై భాజపా వేటు

న్యూ ఢిల్లీ: జాతిపిత మహాత్మ గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశభక్తుడుగా అభివర్ణించిన లోక్సభ సభ్యురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ను రక్షణ శాఖ పార్లమెంటరీ సమితి నుంచి తొలగించినట్లు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఇక్కడ తెలిపారు. ఇంకా ఈ విడత భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ఆమెను బహిష్కరించినట్లు వెల్లడించారు. పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని భాజపా ఎన్నటికీ సహించదన్నారు. ప్రజ్ఞా ఠాకూర్ చర్యను భాజపా క్రమ శిక్షణా సమితి పరిశీలిస్తోంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో బుధవారం ఎస్పీజీ(సవరణ) ముసాయిదాపై జరిగిన చర్చలో మహాత్మా గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చిందని డీఎంకే సభ్యుడు రాజా ప్రస్తావించటమే తరువాయి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, గాడ్సే దేశ భక్తుడని వ్యాఖ్యానించారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ప్రజ్ఞా. లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలోనూ గాడ్సే నిజమైన దేశభక్తుడని కొనియాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos