జగన్ పై దాడి కేసులో కీలక పరిణామాలు

జగన్ పై దాడి కేసులో కీలక పరిణామాలు

జగన్ పై దాడి కేసులో శుక్రవారం కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో విచారణ జరిపిన సిట్ ‌ సహాయ నిరాకరణపై…… ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్‌ సహకరించడం లేదంటూ ఎన్‌ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్‌ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్‌ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది.మరోవైపు… ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు విధించిన ఎన్‌ఐఏ కస్టడీ గడువు ముగిసింది. వారం రోజుల విచారణ అనంతరం.. అధికారులు అతన్ని ఎన్‌ఐఏ కోర్టులో హజరుపర్చటంతో కోర్టు అతనికి ఈ నెల 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది..మరోవైపు ఎన్‌ఐఏ తీరును నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు ఆక్షేపించారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఐఏ భేఖాతరు చేసిందంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్‌ వేశారు.తాము లేకుండానే 18 గంటలు విచారణ చేశారన్నారు. కోర్టు ఆదేశాలను ఎన్‌ఐఏ అధికారులు పూర్తిస్థాయిలో పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా .. తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాడు నిందితుడు శ్రీనివాస్‌రావు. అటు…శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ వాదించారు ఆయన తరుపు లాయర్‌. విజయవాడ జైలులో భద్రత లేదని పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు శ్రీనివాసరావును రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించాలని ఆదేశాలు జారీచేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos