ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అధికార,ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.తాజాగా తెదేపా నేత బొండా ఉమ వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అమరావతిని 150 వైసీపీ పశువులు నాశనం చేస్తున్నాయని అన్నారు. అమరావతిని శ్మశానంతో పోల్చుతూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.తమ హయాంలో రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులతో పాటు పలు భవనాలను నిర్మించామని… వైసీపీ మాత్రం రాజధానిని శ్మశానంలా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని ఒక బూతుల మంత్రి అని విమర్శించారు. బూతులకు కూడా ఒక మంత్రిని పెడతారా? అని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానంతో పోలుస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే..