న్యూ ఢిల్లీ: ఐఎన్ఎస్ మీడియా కేసులో గత మూడు నెలలుగా తీహార్ చెరసాల్లో బంధీగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఉదయం కలిశారు. దాదాపు 20 నిమిషాలకు పైగా మంతనాలు సాగించారు. ఆయన్ను పరామర్శించిన సోనియా త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చినట్లు సమాచారం. తదుపరి విలేఖరులతో మాట్లాడకుండానే వారు చెరసాల ఆవరణ నుంచి వెళ్లి పోయారు. చెరసాల వద్ద పోలీసులు భద్రతను పెంచారు.