అక్రమ సంబంధాల కోసం భర్తలు,పిల్లల్ని చంపేస్తున్నారు..

  • In Film
  • November 27, 2019
  • 159 Views
అక్రమ సంబంధాల కోసం భర్తలు,పిల్లల్ని చంపేస్తున్నారు..

మహిళలపై తమిళనటుడు దర్శకనటుడు భాగ్యరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.వివాహేతర సంబంధాల కోసం ఈరోజులో మహిళలు భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారని ప్రముఖ సినీ దర్శకుడు భాగ్యరాజా అన్నారు. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని.. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని చెప్పారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణమని అన్నారు.పొల్లాచ్చి అత్యాచారం ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదని భాగ్యరాజా చెప్పారు. అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినందు వల్లే తన సినిమాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చానని చెప్పారు.మరోవైపు, భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటేపురుషుల తప్పేమీ లేదని అంటరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుమారం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos