ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ  బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ నెల 30 నుంచి జరగాల్సిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4 నుంచి 11 మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా పడ్డాయి. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే యోచన నేపథ్యంలో సమావేశాలు వాయిదా పడినట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos