చిరంజీవి ఇంట తారల సందడి

  • In Film
  • November 25, 2019
  • 175 Views
చిరంజీవి ఇంట తారల సందడి

అగ్ర నటుడు చిరంజీవి సహా ఎనిమిదో దశకంలో నటించిన దక్షిణాది, బాలీవుడ్‌ తారలందరూ ఏటా ఒక చోట కలుసుకుని విందులు, వినోదాలతో గడపడం పరిపాటి. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా తారలందరూ చిరంజీవి ఇంట కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగిన ఈ ఉత్సవానికి 40 మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. పైన ఉన్న ఫొటోలో ప్రభు, జయరామ్, సురేశ్, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, నాగార్జున, మోహన్‌లా, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌ కుమార్, వీకే నరేశ్, రమేశ్ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, రేవతి తదితరులు ఉన్నారు. ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్‌ కోడ్‌ బ్లాక్, గోల్డ్ కలర్స్. అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు. ఈ పార్టీలో తారలందరూ అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్స్ వంటి సరదా ఆటలతో కాలక్షేపం చేసినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos