రష్మిక మందన్నా వరుస క్రేజీ చిత్రాలతో ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ దిశగా దూసుకుపోతోంది.మూడేళ్ల క్రితం కిరిక్‌పార్టీతో వెండితెరకు పరిచయమైన రష్మిక అనంతరం తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి కొద్ది కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.తెలుగు,తమిళం,కన్నడ భాషల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ రేంజుకు దూసుకెళ్లింది.అయితే రష్మికకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి కారణమైన రక్షిత్‌శెట్టి గురించి మాత్రం ఎవరికీ తెలియదు.కన్నడ మినహా తెలుగు,తమిళం సినీప్రేక్షకులకు అసలు రక్షిత్‌శెట్టి ఎవరో తెలియదు.కానీ రష్మిక మాజీ ప్రేమికుడు అంటే మాత్రం అంతోఇంతో గుర్తు పడతారు.దీంతో రష్మికలాగే తను కూడా ఇతర చిత్రపరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రక్షిత్‌శెట్టి తన కొత్త చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో సైతం విడుదల చేస్తున్నాడు.వచ్చేనెల 27వ తేదీన అతడే శ్రీమన్నారాయణ పేరుతో చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. ఈ ప్రయత్నం చూస్తుంటే తనను కాదని వెళ్లిపోయిన రష్మిక కంటే క్రేజ్ తెచ్చుకోవాలనే బిగ్ ఛాలెంజ్ తీసుకున్నాడని భావించవచ్చు.మరి ఈ ఛాలెంజ్‌లో రక్షిత్ ఎలా గెలుచుకొస్తాడో చూడాలి..