ముంబై: శాసనసభ్యుల సమావేశం హాజరు పట్టిక సంతకాల్ని అజిత్ పవార్ దుర్వినియోగం చేశారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ఆ సంతకాలతో కూడిన పత్రాల్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. వాటి ఆధారంగానే ప్రమాణస్వీకారం జరిగింద’న్నారు. శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఏర్పడ్డ -మహా ఆఘాడీ ఐకమత్యంగానే ఉందన్నారు. ‘తాజా ప్రభుత్వం మోసపూరితంగా ఏర్పడింది. విశ్వాస పరీక్షలో కచ్చితంగా ఓడిపోతుంద’ని వ్యాఖ్యానించారు.