అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు

అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు

ముంబై:ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గూడు చేరుకున్నారు. ‘ఏదో పని ఉందని అజిత్ పవార్ ఫోన్ చేశారు. దీంతో మేము రాజ్ భవన్కు వెళ్లాం. మాకు అంతకు మిం చి ఏమీ తెలియద’ని వివరించారు. వారిలో ఒకరైన రాజేంద్ర షింగానె శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అజిత్ పవా ర్ నాకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలని పిలిచారు. దాంతో రాజ్ భవన్ కు వెళ్లాను. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకా రం జరుగుతోంది. దీంతో నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను. ఆయనకు మద్ద తుగా ఉంటానని చెప్పా ను. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగు తుంద న్న విషయం కూడా మాకు తెలియదు’ అని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos