ముంబై: ‘పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక ఏర్పడింది’ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలె తన వాట్సాప్ స్టేటస్‌లో శనివారం వ్యాఖ్యానించారు. ఈ వాట్సాప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భాజపా నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణాలు చేయటం తెలిసిందే. తాజా పరిణామాలపై సాయంత్రం 4 గంటలకు శరద్ పవార్ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.