వాషింగ్టన్: దాదాపు రూ. ఏడు వేల కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఇండియాకు విక్రయించనున్నట్లు అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు గురువారం తెలిపారు. నౌకా దళానికి ఉపయుక్తమయ్యేలా 13 ఎంకే 45, 5 అంగుళాలు / 62 కాలిబర్ మోడ్ 4 నావెల్ గన్స్ ను అమ్మనున్నట్లు వివరించారు. వీటిని బీఏఈ సిస్టమ్స్ అండ్ ఆర్మామెంట్స్ తయారు చేస్తోంది. వీటితో ఇరుగు, పొరుగు దేశాల నుంచి దాడుల నుంచి తప్పించుకోవచ్చు.