విడుదలైన నిమిషాల్లోనే మళ్లీ అరెస్ట్‌..

విడుదలైన నిమిషాల్లోనే మళ్లీ అరెస్ట్‌..

జైలు నుంచి విడుదల చేసిన కాసేపటికే పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.విశాఖ జిల్లా పెదబయలుకు చెందిన గిరిజన యువకులు నూకరాజు, పాంగి కామేశ్వరరావు, గొల్లూరి రాజు, వంతల రావులను మూడు నెలల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్ ఖైదీలుగా వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉంచారు.బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలిచిన కోర్టు కండిషనల్బెయిల్ను మంజూరు చేసింది.దీంతో నలుగురూ నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. తమ కోసం వచ్చిన బంధువులతో కలిసి ఆటోలో ఇంటికి బయలుదేరారు.ఈ క్రమంలో పైనాపిల్కాలనీ వద్ద నలుగురిని అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు.ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియరాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos