న్యూఢిల్లీ: రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా మార్షల్స్ నూతన సమ వస్త్రాలపై వివాదం చెల రేగింది. మార్షల్స్ ధరించి న దుస్తులు సైనికుల్ని తలపిస్తున్నాయని విపక్ష నేతలు ఆక్షేపించారు. దీంతో కొత్త సమ వస్త్రాల గురించి పునః సమీక్షిం చాలని రాజ్యసభ కచ్చేరీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు కోరారు. పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల నుంచి తనకు ఈ విషయమై అభ్యంతరాలు అందాయని వెంకయ్య పేర్కొన్నారు. వాస్తవానికి గతంలో మార్షల్స్ సఫారీ దుస్తులు, తల పా గా తో కనిపించేవారు. ఆధునిక అవసరాలకు తగినట్టుగా సమ వస్త్రాల్ని కొత్త రూపంలోకి మార్చాలని ఇటీవల వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. దరిమిలా సైనిక దుస్తుల సమవస్త్రాల్ని అమలు చేసారు. ముదురు నీలి రంగులో ఉండి, భుజాలపై చిహ్నాలు, బంగారు వర్ణపు గుండీలు, ఆర్మీ మాదిరి బంగారు వర్ణంలోని ఏగ్విలెట్ తదితర విశేషాలు ఈ యూనిఫామ్లో్ ఉన్నాయి. టోపీ బ్రిగేడియర్, ఆపై అధికారులను తలపిస్తోందని విమర్శలు వచ్చాయి.