భూమికి పట్టా ఇవ్వడం లేదని పెట్రోల్ చల్లాడు..

భూమికి పట్టా ఇవ్వడం లేదని పెట్రోల్ చల్లాడు..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ఇతర మారణాయుధాలతో ప్రభుత్వ అధికారులపై రైతులు,ప్రజల బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం చెలరేగింది.తన భూమికి పట్టా మంజూరు చేయాలంటూ చాలా కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆక్రోశంతో సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్, అటెండర్ దివ్యపై పెట్రోల్ చల్లాడు.దీంతో సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది.ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్.. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు.రైతులు,ప్రజలు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనల్లో ఎక్కవగా రెవెన్యూ అధికారులే ఉంటుండడం గమనార్హం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos