సమంత త్వరలోనే తల్లి కావాలని అనుకుంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న వార్తలకు బలం చేకూరేలా సమంత వ్యాఖ్యలు చేసింది.తాజాగా నెటిజన్లు,అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో ఓ నెటిజన్ ‘మీ కిడ్ ఎప్పుడు రాబోతుంది‘ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె ‘నా శరీరంలో చాలా ఆసక్తికరమైన మార్పులు వస్తున్నాయి. సో.. 2022 ఆగస్ట్ ఏడో తేదీన… ఉదయం ఏడు గంటలకు నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా‘ అని సమాధానం చెప్పింది.సమంత నెటిజన్ ప్రశ్నకు చెప్పిన సమాధానంతో ఆమె ఫ్యాన్స్తో పాటు సామాన్యులందరూ అయోమయానికి గురవుతున్నారు. తనపై తరచూ వస్తున్న వార్తలకు పుల్స్టాప్ పెట్టేందుకు సమంత ఈ విధంగా స్పందించిందన్న విషయం చాలా మందికి అర్థం కావడం లేదు. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుందని అనుకుంటున్నారు.